31, డిసెంబర్ 2010, శుక్రవారం

మాన్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...

ఈ కొత్త సంవత్సరం మీకు కొత్త జీవితాన్ని, సుఖ శాంతుల్ని చేకూర్చాలని ఆశిస్తు...


మీ జగన్

లంచం మంచిదే.... లంచగొండులారా తీసుకున్న లంచానికి పన్ను చెల్లించండి...

కోప్పడకండి...

కాస్త ఆలోచించండి...

నేను ఈ మధ్య ఆర్.టి.ఓ. ఆఫీసు కి వెళ్ళాను...

వీరావేశం తో, లంచం నేరం అని స్నేహితులందరి దగ్గర లెక్చరు ఇచ్చి. నేను పైసా లంచం ఇవ్వకుండా డ్రైవింగు లైసెన్సు సాధించుకొస్తానని చెప్పి, ఇక్కడికి వచ్చిన నాకు చుక్కలు కనిపించాయి. ఒక్కరు కూడా హెల్ప్ చెయ్యటం లేదు. అప్లికేషను తీసుకోవటం దగ్గర నుండి ఆఫీసరు కి అందచేసినవరకు ఒక్క దగ్గర కూడా నన్ను ఎవ్వరూ హెల్ప్ చెయ్యలేదు. వారికి కోపం, వాళ్ళ పొట్ట కొట్టి నేను లైసెన్సు తీసుకుంటున్నానని. చివరకి ఎలాగోల ఆఫీసరు వరకు తీసుకెల్లా. అతను దేవుడేమి కాదు, తేరగా వచ్చే డబ్బు పోగొట్టుకోటానికి, 500/- ఆమ్యామ్యా... అడిగాడు. నేను యెదవ రూల్సు అన్ని మాట్లాడా. రూల్సు వాడికి బాగా తెలుసు అనుకుంటా, అప్లికెషను సరిగ్గా నింపలేదని అడ్డంగా చించి పారేసాడు.

   నిజమే, ఒక డ్రైవింగు లైసెన్సు కి వాళ్ళు 1000/- తీసుకుంటారు. దానితో వాళ్ళ జీవతం గడుపుతుంటారు. వరదబాధితుల పులిహోర పొట్లం కొట్టెయ్యటం ఎంత పాపమో వీళ్ళ జీవనాధరం కొట్టెయ్యటం అంతే పాపం.

   ఇలా తేరగా వచ్చే డబ్బు తో ఒక గుమాస్తా తన కూతురి పెళ్ళి కి ఒక కోటి అయినా కట్నం ఇవ్వాలనుకుంటాడు. ఒక మేనేజరు తన రెండో పెళ్ళానికి ఒక రవ్వల నక్లీసు, ఒక పెద్ద ఆఫీసరు తన కొడుకులకి విదేశాలు పంపించి చదివించాలనుకుంటాడు.

  మనమిచ్చే ఈ లంచం తో ఇంతమంది జీవితాల్లో వెలుగు నింపగలిగినప్పుడు, లంచం మంచిదే...

  మా ఊరిలో ఒక పెద్ద గవర్నమెంటు ఆఫీసరు రెండు అంతస్థుల మేడ ఇల్లు కట్టాడు. అందరూ అతను బాగా సంపాదిస్తున్నాడు అని పొగుడుతారు తప్ప వాడు దోచుకుంటున్నడు అనరు. అంటే లంచం అదరి అమోద యోగ్యమే కదా.

నా ద్రుష్టిలో లంచం మంచిదే.
ఒక తండ్రి తన కొడుకులకి మంచి భవిష్యత్తు ఇవ్వటానికి, తన కుటుంబాన్ని పోషించటానికి లంచం అడిగితే.
ఏదైనా పని చెయ్యటం వల్ల ఇతరులకి హాని కలగదంటే, ఆ పని చెయ్యటానికి లంచం అడిగితే.
బాగ ఉన్నవాడిని, డబ్బు అంటే లెక్కలేని వాడిని లంచం అడిగితే.

నా అభిప్రాయం తప్పు అని మీరు భావిస్తే నన్ను క్షమించండి. కానీ లంచం తీసుకుని తన కుటుంబాన్ని, తనను పోషించుకోవటం తప్పేమీ కాదు. అదే డబ్బుని దేశ వినాశనానికి, పరాపకారనికి లేదా దేశ భవిష్యత్తుకే చేటు గా స్విస్సు బ్యాంకులలో దాచుకోవటం నేరం.


నా అభిప్రాయం:
లంచగొండులారా తీసుకున్న లంచానికి పన్ను చెల్లించండి. దాచుకున్న డబ్బుని దేశ వాణిజ్య సంస్థలలో పెట్టుబడులు పెట్టండి.