31, డిసెంబర్ 2010, శుక్రవారం

మాన్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...

ఈ కొత్త సంవత్సరం మీకు కొత్త జీవితాన్ని, సుఖ శాంతుల్ని చేకూర్చాలని ఆశిస్తు...


మీ జగన్

లంచం మంచిదే.... లంచగొండులారా తీసుకున్న లంచానికి పన్ను చెల్లించండి...

కోప్పడకండి...

కాస్త ఆలోచించండి...

నేను ఈ మధ్య ఆర్.టి.ఓ. ఆఫీసు కి వెళ్ళాను...

వీరావేశం తో, లంచం నేరం అని స్నేహితులందరి దగ్గర లెక్చరు ఇచ్చి. నేను పైసా లంచం ఇవ్వకుండా డ్రైవింగు లైసెన్సు సాధించుకొస్తానని చెప్పి, ఇక్కడికి వచ్చిన నాకు చుక్కలు కనిపించాయి. ఒక్కరు కూడా హెల్ప్ చెయ్యటం లేదు. అప్లికేషను తీసుకోవటం దగ్గర నుండి ఆఫీసరు కి అందచేసినవరకు ఒక్క దగ్గర కూడా నన్ను ఎవ్వరూ హెల్ప్ చెయ్యలేదు. వారికి కోపం, వాళ్ళ పొట్ట కొట్టి నేను లైసెన్సు తీసుకుంటున్నానని. చివరకి ఎలాగోల ఆఫీసరు వరకు తీసుకెల్లా. అతను దేవుడేమి కాదు, తేరగా వచ్చే డబ్బు పోగొట్టుకోటానికి, 500/- ఆమ్యామ్యా... అడిగాడు. నేను యెదవ రూల్సు అన్ని మాట్లాడా. రూల్సు వాడికి బాగా తెలుసు అనుకుంటా, అప్లికెషను సరిగ్గా నింపలేదని అడ్డంగా చించి పారేసాడు.

   నిజమే, ఒక డ్రైవింగు లైసెన్సు కి వాళ్ళు 1000/- తీసుకుంటారు. దానితో వాళ్ళ జీవతం గడుపుతుంటారు. వరదబాధితుల పులిహోర పొట్లం కొట్టెయ్యటం ఎంత పాపమో వీళ్ళ జీవనాధరం కొట్టెయ్యటం అంతే పాపం.

   ఇలా తేరగా వచ్చే డబ్బు తో ఒక గుమాస్తా తన కూతురి పెళ్ళి కి ఒక కోటి అయినా కట్నం ఇవ్వాలనుకుంటాడు. ఒక మేనేజరు తన రెండో పెళ్ళానికి ఒక రవ్వల నక్లీసు, ఒక పెద్ద ఆఫీసరు తన కొడుకులకి విదేశాలు పంపించి చదివించాలనుకుంటాడు.

  మనమిచ్చే ఈ లంచం తో ఇంతమంది జీవితాల్లో వెలుగు నింపగలిగినప్పుడు, లంచం మంచిదే...

  మా ఊరిలో ఒక పెద్ద గవర్నమెంటు ఆఫీసరు రెండు అంతస్థుల మేడ ఇల్లు కట్టాడు. అందరూ అతను బాగా సంపాదిస్తున్నాడు అని పొగుడుతారు తప్ప వాడు దోచుకుంటున్నడు అనరు. అంటే లంచం అదరి అమోద యోగ్యమే కదా.

నా ద్రుష్టిలో లంచం మంచిదే.
ఒక తండ్రి తన కొడుకులకి మంచి భవిష్యత్తు ఇవ్వటానికి, తన కుటుంబాన్ని పోషించటానికి లంచం అడిగితే.
ఏదైనా పని చెయ్యటం వల్ల ఇతరులకి హాని కలగదంటే, ఆ పని చెయ్యటానికి లంచం అడిగితే.
బాగ ఉన్నవాడిని, డబ్బు అంటే లెక్కలేని వాడిని లంచం అడిగితే.

నా అభిప్రాయం తప్పు అని మీరు భావిస్తే నన్ను క్షమించండి. కానీ లంచం తీసుకుని తన కుటుంబాన్ని, తనను పోషించుకోవటం తప్పేమీ కాదు. అదే డబ్బుని దేశ వినాశనానికి, పరాపకారనికి లేదా దేశ భవిష్యత్తుకే చేటు గా స్విస్సు బ్యాంకులలో దాచుకోవటం నేరం.


నా అభిప్రాయం:
లంచగొండులారా తీసుకున్న లంచానికి పన్ను చెల్లించండి. దాచుకున్న డబ్బుని దేశ వాణిజ్య సంస్థలలో పెట్టుబడులు పెట్టండి.

14, అక్టోబర్ 2010, గురువారం

అమ్మా... తమ్ముడు మన్ను తినేను....

నేను ఒక రోజు స్కూల్ బస్సు లో వెళ్తుండగా...

మా బస్సు డ్రైవరు భక్తి పాటలు వేశాడు... పాట మన "ఎన్.టి.ఆర్" గారి పాండురంగ మహత్యం సినిమా లోనిది... "జయ క్రిష్ణా ముకుందా మురారి... జయ గోవింద బ్రుందా విహారీ"... నేను లీనమైపోయి వింటున్నా.

ఆ పాట మధ్య లో.. "అమ్మా తమ్ముడు మన్నూ తినెను చూడమ్మా అని రామన్న తెలుపగా..." అని వచ్చింది. అంటే శ్రీక్రుష్ణుడు మన్ను తిన్నాడని, యశోదమ్మకు అన్న బలరాముడు తెలియజేస్తాడు. అది విని వెంటనే నాకో ఆలోచన వచ్చింది. ఓ ఓ ఇక్కడ మీకో విషయం చెప్పటం మరిచిపోయాను. ఎప్పుడూ లొడ లొడా వాగే నాకు, నాతో మాట్లాడటానికి మా ఇంట్లో ఎవరూ ఉండేవాళ్ళు కాదు. అంతా వాళ్ళ వాళ్ళ పనుల్లొ తీరిక లెకుండా ఉండేవాళ్ళు. నేను ఏ అల్లరి చేసినా తిరిగి నాకు బ్యాండు పడేది.

అలాంటి నాకు మా అమ్మ కనిపించేది, నన్ను భరించటానికి. ఎప్పుడూ అమ్మ చుట్టూ తిరిగేవాడ్ని. ప్రతి చిన్నదానికీ అమ్మను పిలిచేవాడ్ని. అది పనికొచ్చే విషయమైతే అమ్మ వినేది, హెల్ప్ చేసేది. పనికిరానిదైతే అమ్మ కూడా చిరాకుపడేది.

చివరికి పని ఉన్నా, లేకపోయినా, అవసరం లేకపోయినా నా నోట్లో "అమ్మ అమ్మ" అని తెగ వచ్చేసేది. మా అమ్మ నా పైన విసుక్కునేది. నాకు బాధనిపించేది కాని ఏం చెయ్యను నాకు అలవాటైపొయింది.

ఇప్పుడు ఆ బస్సులో ఆ "అమ్మా తమ్ముడు మన్నూ తినెను చూడమ్మా అని రామన్న తెలుపగా..." విని దీనిని వాడుకోవాలని ఒక ఆలోచన వచ్చింది.

అప్పట్నుంచి ఎప్పుడైనా పొరపాటున "అమ్మ" అని వస్తే, మా అమ్మ చిరాగ్గా నా వైపు చూసినప్పుడు ఆమెను శాంతపరచటానికి కొనసాగింపు అన్నట్టు ఆ మిగిలిన ముక్క "తమ్ముడు మన్ను తినెను" అని పాడేసే వాడ్ని. చిరాకు ముఖం లో కాస్త చిరునవ్వు వచ్చేసేది.

 మీకు చెప్తే నవ్వుతారేమో.. ఈ అలవాటు ఇంకా ఉంది నాకు. ఇప్పుడైతె మా అమ్మ చాలా సున్నితంగా "తమ్ముడు మన్ను తినటం ఇంకా ఆపలేదా నాయనా"... అంటుంది. ఇద్దరం తెగ నవ్వుకుంటాం, నేను చిన్నప్పుడు చేసిన అల్లరి గురించి మా అమ్మ చెప్తుంటే.

మీరు కూడా చిన్నపుడు తెగ అల్లరి చేసుంటారు. అభ్యంతరం లేకపొతే... ఈ పోస్టు కి కమెంటు లో మీకు నచ్చిన ఏదో ఒక అల్లరి పనిని వ్రాయండి.

"పాత ఙ్ఞాపకాలను నెమరు వేసుకునేది స్నేహితులతోనే గా".... మీ... జగన్

13, అక్టోబర్ 2010, బుధవారం

బతుకు బంగాళదుంప అయ్యింది...

నిజమే,

యదవ జీవితం ఎవడు కనిపెట్టాడో గాని, బతుకు బంగాళదుంప అవుతుంది.


బొంగులోది ఒక బర్గరో, బాదుషా నో అవ్వచ్చుగా జీవితం మెత్తగా, సాఫీ గా సాగిపోయేది. ఎవడుబడితే వాడు తెగ పిసికేసి పానిపూరి లో వేసినట్టు, మసాలా చాట్ లో పడేసినట్టు తుక్కు తుక్కు గా తయారయ్యింది.

ఓపీసుకెల్లి పనిసేడ్డామంటే, ఒక్క రిక్వైర్మెంటు సరిగా ఉండదు. ఉన్నదానికి బిల్లిన్గుండదు.


పోనీ టి.వి. పెట్టి ఏదైనా ప్రోగ్రాం చూధ్ధామన్నా ముత్తాతల కాలం నాటి "మొగలిరేకులు", కొత్తగా కాల్చుకు తింటున్న "బాబోయ్ జీనియస్..." వామ్మోయ్ "చాలెంజు" వేసి వేసి సావగోడ్తున్నాడు. అవన్నీ పక్కనెట్టి కొత్తగా పేరు మార్చిన "జెమిని మూవీస్" చుద్దామంటే అదేదో "రోబో" అంట, ఆ సినిమా ట్రైలర్ల మధ్య చిన్న చిన్న సినిమాలేవో వేస్తున్నట్టు గందరగోళంగా ఉంది.


పోనీ రాజకీయాల్లొకి వెళ్లి మన చిరు అన్నకి ఏదో హెల్ప్ చేద్దామా అంటే, ఆయన వేడి తగ్గినట్టుంది. లేక వేసవి కాలం లో తిరిగి తిరిగి వేడి చేసినట్టుంది. ఈ మధ్య టి. వి. ప్రోగ్రాములలోను, అవార్డు పంక్షన్ల లోను తెగ కనిపిస్తన్నాడు.


పులి దెబ్బకి విల విల లాడుతున్న మన పవనన్న "కామన్ మెన్ (నాట్ ఫర్ వుమెన్) ప్రోటక్షను" బ్రాంచి ఓపెను చేస్తే అందులో మెంబరు గా చేరిపోవాలని అనుకుంటున్నా. అన్న ఇంకా దయతలచలా. చూద్దాం.


సినిమాల్లోకి ఎల్లిపోయి "పోకిరి" అంత పెద్ద హిట్టు సినిమా కి డైరెక్షను సేద్దామనుకుంటున్న. అది ఎక్కడ "గోలీమార్" లా గు.గు. పోద్దో అని వెనకడుగేస్తాన్నా.


అయినా ఈ జీవితానికి ఇక చాలనుకొని, రెండు చిడతలట్టుకొని చెక్క బజానా చేస్కోవాలి.


నా భజనకి టైం అవుతుంది మరి. ఇక ఉంటాను.

12, అక్టోబర్ 2010, మంగళవారం

తేడాగాడు... మా సినిమా పేరు... డైరెక్టరు... నేనే

ఏమీ కొత్తగా లేదు కదూ... కాని కధాంశం అంతా సరికొత్తగా ఉంటుంది...

మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చుతుంది...

మా సినిమా చిన్న టైటిలున్న పెద్ద సినిమా, ఈ చిత్రం తో పరిచయమవుతున్న మా హీరో "బొంగ్రీ" కి మంచి గుర్తింపు వస్తుంది.

కథ అంతా ఒక తిక్కలోడు చుట్టూ తిరుగుతుంటుంది.

 రొటీను గా అమ్మాయిలకి బీటేసే ప్రోససు లో, అనుకోని విధంగా హీరో, ఒక అమ్మయి ప్రేమలో పడతాడు. ఆ తరువాత ఆ అమ్మయి కారణంగా హీరో ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కుంటాడు, చివరకు తన ప్రేమ లో విజయం సాధిస్తాడా అన్నదే కథ సారాంశం.

 ఇందులో, కనీ వినీ ఎరగని రీతి లో, భారత దేశం లోనే ప్రప్రధమంగా 3డి గ్రాఫిక్స్ తో హీరోయిన్ ని చూపించాము. అన్ని విజువల్స్ ఎంతో శ్రమించి తీశాం. ఒక పాటలో 56 అత్యాధునీక కెమేరాలను ఉపయోగించి 3 సెకెండ్ల నిడివిలో హీరో హీరోయిన్ ల మధ్య ముద్దు సీను తీసాం. ఇది ఈ సినిమా కి హైలైటు అవుతుంది.

 చిత్రానికి యాక్షన్ సన్నివేసాల్ని కునాల్ వయాన్ (హాలీవుడ్ టెక్నీషియన్) సమకూర్చారు. ఒక్కొక్క ఫైటు 30 నిమిషాల నిడివితో ఉండి ప్రేక్షకులకి హింసా వినోదాన్ని అందిస్తుంది.

 చిత్ర సంభాషణలు అంతా సరికొత్తగా ఉంటాయి. సినిమా మొత్తం కొత్త, పాత అన్ని రకాల భూతులనీ ఉపయోగించాం. ముఖ్యంగా పిల్లలు ఈ భూతుల్ని బాగా ఎంజాయ్ చేస్తారు.

 కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ఇది. ఈ దసరా కి అత్యధికంగా 2 లక్షల ప్రింటులతో విడుదలకి సిధ్ధంగా ఉంది.

 చిత్రం లో హైలైటు డైలాగులు మీ కోసం.

* సొక్కా సింపిదొబ్బుతా...
* బుర్ర ఉన్నా, బ్రెయిన్ సున్నా...
* కండో*** ప్యాకెట్లు ఎత్తుకెల్లే కాకి ఫేసూ నువ్వూ...
* అరిచావంటే మట్టికరుచుకుపోతావ్... ఖబడ్దార్...

 మైండు దొబ్బితే చూడండి మీ అభిమాన థియేటర్లలో....

5, అక్టోబర్ 2010, మంగళవారం

అప్పుడు నా వయసు ఎనిమిదేళ్ళు...

   కొత్తగా నేను టౌనుకు వెళ్ళా... నా మూడో తరగతి లో నన్ను మా ఊరికి ఎంతో దూరం లో ఉన్న కోటబొమ్మాళి కి తీసుకెళ్ళారు మా నాన్న గారు. ముందు చెప్పినట్టు నాకు అక్కడ అంతా కొత్తగా అనిపించింది. టౌనులో దిగగానే మా నాన్న నన్ను తిన్నగా ఒక స్కూల్ కి తీసుకెళ్ళారు. నాకు ఆ స్కూల్, అక్కడ ఆటస్థలం, డ్రిల్ల్ చెస్తూ, ఆటలాడుతూ కొంతమంది పిల్లలు కనిపించారు. వాళ్ళ యూనిఫార్మ్ బట్టలు, కాళ్ళకేసుకున్న బూట్లు చూసి తెగ సంబరపడిపొయా. అంతె, ఇక ఇంటికి వచ్చి మా అమ్మతో, తమ్ముడి తో చెప్పి గంతులేసేవాణ్ణి. మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్తానా అనిపంచేది.

   ఆ టైం వచ్చింది. మా అమ్మ నన్ను నీట్ గా తయరు చేసింది, నా కోసం కొన్న బూట్లను తొడిగింది. మా పొరుగూరి వరకూ (అప్పటికి మా ఊరికి బస్సు సదుపాయం లేదు...) తోడుగా తను, తమ్ముడు, మా నాన్నమ్మ... అంతా వచ్చారు. వెళ్ళొస్తానని మా ఊళ్ళో కనిపించిన ప్రతి ఒక్కరికీ చెప్తున్నా. అందరూ నన్ను సాగనంపారు. అమ్మ వచ్చి నా నుదిటిపైన ముద్దు పెట్టి బాగా చదువుకోమని, ఎవరితోనూ గొడవ పడొద్దని చెప్పి నన్ను బస్సు ఎక్కించింది. తమ్ముడికి టాటా చెప్పి నాన్న పక్కనే కిటికీ వైపు సీటు లొ కుర్చున్న. కాసేపు తర్వాత, కిటికీ నుంచి వచ్చే చల్ల గాలికి మా నాన్న ఒడిలోకి చేరి మెల్లగా నిద్రపొయా. లేచేసరికి మళ్ళీ అదే స్కూలు.

   తిన్నగ తీసుకెళ్ళి ఒక క్లాసు లో కూర్చొపెట్టారు. అంతా కొత్త మనుషులు. క్లాసులో కూర్చోటానికి బల్లలు, అందరి ఒళ్ళోనూ పుస్తకాలు బ్యాగులూ ఉన్నాయ్. నా ప్రక్కన కూర్చున్న అబ్బాయి చేతిలో ఇంగ్లిషు పుస్తకం. మంచి మంచి బొమ్మలుతో అందంగా ఉంది అది. మా నాన్న నన్ను అక్కడే వదిలేసి ఆ ఊళ్ళోనే ఉన్న మా బంధువుల ఇంటికి వెళ్ళారు. నేను మధ్యహ్నం కూడా అక్కడే తిని సాయంత్రం మా నాన్న వస్తే ఇంటికి బయలుదేరాలని చూస్తూ క్లాసు బయట ఒక బల్ల పైన కుర్చున్న. పిల్లలంతా కేరింతలు కొడ్తూ స్నాన్నాలు చేస్తున్నారు. ఇంతలో హెడ్మాస్టారు వచ్చి, మీ నాన్నగారు ఇక రారనీ, నన్ను ఆ స్కూలు లోనే హాస్టలు లో జాయిన్ చెసారని చెప్పారు. నేను అదేమి నమ్మకుండా, ఏదో తమాషాకి అంటున్నారనుకునీ, తిరిగి అతనితో, మా ఊరు పక్కనే అనీ, నేను మా ఊరినుంచి స్కూలు కి వెళ్ళివస్తుంటానని చెప్పా. అతను నా తెలివితేటలకి చిన్నగా నవ్వి, వివరంగా చెప్పరు.

   నిజమే, నేను మా ఊరి నుంచి దాదాపు 80 కి. మి. ల దూరం లో ఉన్నా. అప్పటివరకూ నాకు గుర్తుకు రాని తమ్ముడు, నాన్నమ్మ, మా ఇల్లు, మా ఊరు, నేను టాటా చెప్తున్నప్పుడు నా వైపు జాలి గా చూసిన మా ఊరి వాళ్ళ ముఖాలు. నన్ను బస్సు ఎక్కించి ఏడుస్తూ తిరిగి వెళ్ళిపొయిన మా అమ్మ ఒక్కసారిగా గుర్తొచ్చారు. నేను ఏడిస్తే ఆ ఏడుపు విని అయినా పరిగెత్తుకు వస్తారని గుక్కతిప్పకుండా ఏద్చను. అప్పటి వరకూ ఎంతో అందంగా కనిపించిన ఆ స్కూలు ఒక జైలు లా కనిపించింది. అక్కడ ఆడుతూ పాడుతూ కనిపించిన పిల్లలంతా నా లాగే తల్లిదండ్రులకు దూరంగా ఉన్న జైలు పక్షుల్లా కనిపించారు. ఎవర్ని చూసినా భయం.

    కాసేపటి తరువాత, నన్ను హాస్టల్ కి తీసుకువెళ్ళి పాలు, బిస్కెట్లు ఇచ్చారు. మా నాన్నగారు నాకొసం కొన్న పుస్తకాలు, బ్యాగు, బట్టలు, ఒక పెట్టె, అందులో నాకోసం 3 నెలలు వరకూ సరిపడా పేస్టులూ, సబ్బులూ అన్నీ ఉంచారు. ఎన్ని ఉన్నా ఆప్యాయంగా చుసే అమ్మ లేదు, నాతో ఆడుకొవటానికి తమ్ముడు లేడు. లాలించి కథలు చెప్పటానికి నాన్నమ్మ, తాతయ్యలు లేరు. అలా ఆ జైలు లో 3 ఏళ్ళు గడిపాను. అవును నా 3,4,5 తరగతులు అక్కడే చదివాను. ఆ తర్వాత ఎన్నో కొత్త జైళ్ళు మారాననుకోండి.


    ఇంకా మరెన్నో అనుభవాలతో మరిన్ని పుటలు రాస్తాను. మీకు నచ్చితే ఒక చిన్న కామెంటు పెట్టండేం. ఉంటాను మరి.

    మీ అందరి శ్రేయస్సూ అభిలషిస్తూ...

                                                                మీ... మిత్రుడు.