31, డిసెంబర్ 2011, శనివారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు

వత్సరం గడచి తన నూతన సంవత్సరాన్ని మనకిస్తోంది...
ఈ నూతన సంవత్సరం... మీకు మీ కుటుంబానికి సుఖ సంతోషాలను, సిరి సంపదలను... అందించాలని కోరుకుంటూ...
అందరికీ "నూతన సంవత్సర శుభాకాంక్షలు"
మీ శ్రేయోభిలాషి...

3, జూన్ 2011, శుక్రవారం

నా డిగ్రీ లో...

అబ్బో నా డిగ్రీ లో చాలా చేసాను లెండి...
మీకు ఈ కిందవాటి లో ఏమైనా ఎదురయ్యయా?
1. 1వ సంవత్సరం లో... క్లాస్ లో పక్కనే కూర్చొని "మందు కొడదాం పద మామా" అని సతాయించే ఫ్రెండ్స్ తగిలారా...?
2. క్లాస్ లో అందమైన అమ్మాయిల లిస్టు తయారు చేసి రోజుకో అమ్మాయిని ఫాలో చెయ్యటం... వాల్ల బాబులు పీకే క్లాసు లు భరించలేకపోవటం...
3. కాలేజ్ ఫీజు ఎగ్గొట్టి తెగ తాగెయ్యటం...
4. టి.టి.సి. కోచింగ్ అని చెప్పి ఇంట్లొ డబ్బులు నొక్కెయ్యటం...
5. పిక్నిక్ కి ఫ్రెండ్స్ తో వెళ్ళి ఫుల్లుగా తాగేసి, పాపం తాగని అమాయకపు జీవుల్ని బీచ్ ల్లో తెగ ఏడిపించటం...
6. దొంగ లవ్ లెట్టర్ లు స్రుష్టించి జంటల్ని క్రియేట్ చెయ్యటం, కుదరక పోతే తగవులు పెట్టించటం...
7. ముందు రోజు మందెక్కువైతే, హేంగోవర్ లో మీరుంటే క్లాస్ లో కంప్యూటర్ లెక్చరర్ మిమ్మల్ని లేపి "ఫెబినోకీ సిరీస్ కి 'సీ' ప్రోగ్రాం" రాయమంటే....
8. కాలేజు ఫీజు కట్టలేదని మీ ప్రిన్సి ఫైనల్ ఇయర్ ల్యాబ్ ఎగ్జాం కి అనుమతించకపోవటం...
9. చివరి ఎగ్జాం రోజు ఒక పెద్ద స్లిప్పుల కట్టతో ఇన్విజిలేటర్ కి దొరికిపోవటం...
10. రిజల్టు రోజు కాలేజ్ గేట్ మాన్ నాకన్నా ముందు నా రిజల్టు చూసి, షాక్ అయ్యి, ఫోన్ చేసి "ఒరేయ్ యదవ, నువ్వెలా పాసయ్యవురా అని అంటే..." పాసయ్యింది సెకండ్ క్లాసు లో అయినా అదో డిస్టింక్షన్ లెవల్ లో పార్టీ చేసుకోవటం...

అర్ధమయ్యే ఉంటది మన దిన దినాభివ్రుద్ధి... అబ్బో చాలా ఉన్నయ్, కాని ***** చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని భయపడి చెప్పట్లేదు గాని, లేకపొతే పెద్ద పురాణం విప్పెయ్యనూ...

9, మే 2011, సోమవారం

అవినీతి పై పోరాటం. ఆకలితో అన్నం కై ఆరాటం ఎప్పటికీ ఆగవు... ఆరభించటం అనవసరం

"అన్నా హజారే" అవినీతిపై పోరాటానికి తయారైన ఒక ఆయుధం...
కొన్ని దశాబ్దాలుగా అవినీతి అనే కేన్సరు తో కుల్లి క్రుశించుకుపోయిన ఈ దేశాన్ని కోయగా మిగిలిన కొద్దో గొప్పో విడి భాగాల్ని కాపాడుకోవటానికి అవతరించిన మహాయుధం.
మన దేశం లో ఏ పౌరుడ్నైనా "అవినీతి అంటే ఏమిటి?" అని అడిగితే పేరాలు పేరాలు అనర్గళంగా ఆరుగంటల పాటు చెప్పగలడు. ఎందుకంటే మనం అవినీతి లో పుట్టి పెరిగి చస్తున్నాం కాబట్టి. మన అందరితో ఇంత దర్జా గా మహరాజులా బ్రతుకుతున్న అవినీతి, మన నర నరాల్లో ఇముడుకు పోయిన అవినీతి, ఇంతకాలం మన అవసరాలను, అవకాసాలను ఇస్తున్న అవినీతి, హఠాత్తుగా ఉద్యమాలు చేసి, చట్టాలు చేసి పారద్రోలాలి అన్నంత దీనం గా ఎందుకివాళ మన అందరిచేత అసహ్యించుకోబడుతుంది.
స్వాతంత్ర్యం కోసం సత్యాగ్రహాలు చేసినపుడు మన శత్రువు "బానిసత్వం" కాదు, "ఆంగ్లేయులు". అందువల్లే వాళ్ళని తరిమేసి బానిసత్వాన్ని జయించాం, స్వరాజ్యం సాధించుకున్నాం.
మరి ఇప్పుడు ఈ సత్యాగ్రహం లో మన శత్రువు "అవినీతి" మరి దానిని నాశనం చెయ్యటానికి ఎవరిని తరిమెయ్యాలి? అలా తరిమెయ్యాల్సి వస్తే ఎంతమందిని తరిమెయ్యాలి? 1.2 కోట్ల భారతీయుల్లో ఒక కోటి మందిని లెక్కేయొచ్చా. నన్నడిగితే అవుననే అంటా. ఇప్పటివరకు అవినీతి వల్ల నష్టపొయిన వాళ్ళు ఎంతమంది ఉన్నరో నాకు తెలియదు కాని, అవినీతిని వాడుకుంటున్న వాళ్ళు, అదో అలవాటుగా బ్రతుకుతున్న వాళ్ళు కోటికి దగ్గరగానే ఉంటారు. ఇలా మనందరం ఆదరిస్తున్న ఈ అనాధ, ఒక్కసారిగా తిరగబడి తరిమెయ్యాలని చూస్తే ఎక్కడికెల్లి బ్రతుకుతుంది. అలవాటుపడిన మనం ఎలా బ్రతుకుతాం.
మొన్న మా స్నేహితుడితో మాట్లాడుతూ, ఈ ఉద్యమం గురించి మాట్లాడుతూ, మాటల మద్యలొ అన్నా, "ఉన్న చట్టాలు సరిగా అమలుచేయటానికే సమయం లేని ఈ పరిస్తితుల్లో, ఉంకో కొత్తచట్టం ఎందుకు, పుస్తకాళ్ళో రాసుకోటానికి తప్ప, మళ్ళీ ఆ చట్టం ప్రస్తుత నాయకుల చేతుల మీదుగ అమలు చెయ్యటం ఒకటి విడ్డూరంగా" "ఇదేదో పిల్లి చేతుల మీదుగా ఎలకల బోను ఓపెనింగ్ సెర్మనీ" లాగ అని అన్నా. దానికి మా వాడు ఆవేశం తో ఊగిపోయి, "ఈ చట్టం ఎప్పట్నుంచో పార్లమెంటులో నలుగుతూ వస్తుంది, ఈ సారి బిల్లు పాసవ్వాలి, అలా ఐతే కనీసం పది పెర్సంటు ప్రజలకైనా ఉపయోగపడ్తుంది" అని అన్నాడు. అప్పుడు గుర్తుకొచాయి మా నాన్న గారి మాటలు. "నాన్నా! చంద్రబాబు మన రాష్ట్రం లో చాలా విప్లవాత్మక మార్పులు తీసుకొచాడు కదా, మరి పని కట్టుకొని వైఎస్సార్ ని గెలిపించటం ఎందుకని అంటే, దానికి మా నాన్న, చంద్రబాబు "శ్రమదానం" అని పెట్టి, మన శ్రమ అంతా దోచుకొని, తెగ డబ్బులు (లక్ష కోట్లు) తినేశాడు, ఈ సారి, వైఎస్సార్ కి పదవి ఇస్తే ఉచిత కరెంటు, ఇంకా కొన్ని పథకాలు పెట్టి, అంతా కాకపోయినా ఒక పది పెర్సెంటు అయినా ప్రజలకి ఖర్చుపెడతాడు" అని అన్నారు.

అప్పుడు అర్ధమయింది, న్యాయంగా వచ్చే 90 పెర్సెంటుకన్నా తేరగా వచ్చే 10 పెర్సెంట్ కి మన దేశం లో ఎంతో వైట్.

ఈ 10 పెర్సెంట్ కి కక్కూర్తి పడి
ఒక ఓటరు దేశ భవిష్యత్తుని తారుమారు చేస్తాడు.
ఒక ప్లీడరు న్యాయాన్ని తారుమారు చేస్తాడు.
ఒక లీడరు ప్రజల ఆశల్ని నీరుగారుస్తాడు.
ఒక కాంట్రాక్టరు, ఒక డాక్టరు, ఒక ఇంజనీరు.... ఒక సగటు భారతీయుడు.
అందరిదీ ఒకటే లోపం "ధనాపేక్ష".

నా ఉద్దేశ్యం లో ఇక్కడ మనం పోరాడాల్సింది అవినీతితో కాదు. మనిషి ఆకలితో... ధనం పై మనిషి పెంచుకున్న వ్యామోహం తో. మనలో ఎంతమంది గుండెల పై చేతులు వేసుకొని చెప్పగలరు? డబ్బు అవసరానికి మించి అక్కర లేదని. మనిషి కి కూడు, గూడు, గుడ్డ కి మించి మరేది అనవసరమని. అలా అలోచించిన రోజు, పరిశ్రమలున్న స్థానం లో పచ్చని చెట్లు, కార్పోరేట్ ఆఫీసులు ఉన్న స్థలాల్లో పచ్చని పొలాలు, రింగు రోడ్డులు ఉన్న చోట అందమైన గుడిసెలు ఎంతో అందం గా ఈ ప్రపంచం మారుతుంది.

మొన్న ఈ మధ్యనే నేను తిరుపతి వెళ్ళా, తిరుమల వరకు నడిచి వెళ్దామని, నేను, నా స్నేహితుడు వెళ్తుంటే, త్రోవ మధ్యలో ఒక పెద్ద కంచె చూసాం. అక్కడ ఎన్నో దుప్పెలు, లేడి లు చూసి భలే ముచ్చటేసింది. నా స్నేహితుడైతే వాటిని చూసి, నాతో ఇలా అన్నడు. "చూడరా మన వాళ్ళు జంతువులన్నింటికి ఒక మంచి కంచె వేసి, వాటికి నీళ్ళ కోసం తొట్టెలు పెట్టి వాటికి మంచి ఆశ్రయం కల్పించారు" అని. నాకు వాడి మాటలకి నవ్వొచ్చింది. అప్పుడు వాడితో అన్నా "అరే మనం వాటి నివాసం అయిన ఈ అడవిని అంతట్నీ కబ్జా చేసుకుని, కొండ ఎక్కటానికని రోడ్డులు, మెట్లు  వేసుకుని, మంచినీటి పైపులు, టీ స్టాల్లు, టిఫిను కొట్లు, సెల్ ఫోను టవర్లు పెట్టుకుని. వాటికి మాత్రం ఒక చిన్న జాగా లో కంచె వేసి, అనాధ శరణాలయం లాంటి ఆవాసం ఇస్తున్నాం". ఇది మనిషి దయాగుణమో, దుర్మార్గమో ఎలా అర్ధం చేసుకోవాలి. ఇది కేవలం మనిషి దోపిడి కి పరాకాష్ట. మనిషి మూగ జీవలనే కాదు, తోటి మనిషిని కూడా జయించాలనుకుంటున్నాడు. దీనికి ఆయుధాలు "దురాశ, స్వార్ధం, వ్యామోహం" వాటికి ఆయువు "డబ్బు". వీటన్నిటికి మనం పెట్టుకున్న ముద్దు పేరు "అవినీతి". ణిజం గా అది మనకు శత్రువే అయితే ఖచ్చితంగా మన ముందు తరాలు దాని అంతం చూసేవి.

దయచేసి, అవినీతి అనే నీతిమాలిన విషయాలని వదిలేద్దాం. మనమున్న ఈ ప్రపంచాన్ని, మనతో ఉన్న ప్రజల్ని గుర్తిద్దాం. మనలోని ఐక్యతని చూసి "దబ్బు" దాని కల్లు కుట్టుకోవలి. "అవినీతి" అంతంకావాలి. "ఉద్యమాల" ఉనికి పోవాలి.

ఇంతాకీ నా ఈ పోస్టు టైటిలు మీకు అర్ధం అయిందో లేదో: "అవినీతి" ఆకలి లాంటిది, దానిని ఒక పూట చల్లార్చినా, మరో పూట ఏదో రూపం లో మళ్ళీ మొదలవుతుంది. నువ్వు ఆకలి తో పోరాడిన, అవినీతి తో పోరాడినా ఫలితం శూన్యం.