4, జనవరి 2012, బుధవారం

మా నాన్నమ్మ దీవెన...

నేను... ఈ మధ్య సెలవు మీద మావురు వెళ్ళినప్పుడు...
ఒక రోజు మధ్యహ్నం అలా ఊరి వీధి లో నడుచుకుంటు వెళ్తున్న. "ఎవరు బాబు నువ్వు?" ఎదురుగా ఒక ముసలావిడ ఆయాసం తొ నడుచుకుంటు వచ్చి, వనుకుతున్న శరీరాన్ని ఒక కర్ర సహాయం తో ఊతం పట్టుకొని, నా ముఖం చుస్తూ అడిగింది. ఆమె వయసు చూస్తే ఒక ఎనభై పైబడి ఉంటయి. పేరైతే గుర్తులేదు కాని! ఆమెతో నాకు బాగానే పరిచయం ఉంది. పద్దైన తర్వాత మన గొడవల్లో పడి పక్కోల్లని మరిచిపోతాం కదా. నేను ఆమెతొ మట్లాడి చాలా కాలమే అయింది. కొంచెం తడబడుతూ... "నా పేరు జగన్ బామ్మా" అన్నా. "ఆ, ఎవరూ?" అని ఒక పెద్ద దీర్ఘం తీస్తూ మళ్ళీ అడిగింది. నిజానికి పుట్టి పెరిగింది ఆ ఉళ్ళోనే అయినా నాకు, నా ఊరికి చాలా పెద్ద దూరమే పెరిగింది అనిపించింది (అంటే మా ఊళ్ళో చాలామందికి నేను తెలీదు :(). "నేను బామ్మ... లింగం నాయిడు గారి మనవడ్ని" అన్నా... "ఆ... మా నరసమ్మ (నాన్నమ్మ పేరు) మనవడివా? బాగున్నావా బాబూ? నువ్వు ఏదొ దేశాలకాడ ఉన్నావాట? ఎప్పుడొచ్చినావు?" అని అలసిపోతూ అలసిపోతూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడగటం ప్రారంభించింది. వాటికి నేను ఓపిగ్గా సమాధానాలు చెప్పి ఇంటి ముఖం పట్టాను.
ఇంట్లో కుర్చీ లో కూర్చొని ఆ ముసలావిడ చెప్పిన మాటలు మా అమ్మతో చెప్పా. "మీ నాయనమ్మ మీ ఇంట్లొ దీపం పెట్టింది నాయినా, ఆ దీపం మీ కుటుంబాన్ని కలకాలం కాపాడుతుంది" ఇలా ఎన్నో అప్పటి విషయాలు చెప్పింది ఆమె. సాయంత్రం వేళ అలా మంచం మీద పడుకుని నా మొబైల్ లో హరికథ విందామని ప్లే చెస్తు వింటున్నా... మధ్యలో
"ఆడించువాడు శంకరుడూ... ఆడెడువాడు ఈశ్వరుండు
ఆడన్... పాడన్... క్రీడించువాడు భవుడు...
అవ్వాడే బ్రహ్మాండ భాండమంత శివుడే..." చాలా చక్కని స్వరం తో శ్రీమతి విన్నకోట రామకుమారి గారి గానం వింటూ అలా నిద్రలోకి జారుకున్నా...
...................
"ఊ... మరేటి నిజుమే కదా...!" అంటూ మా నాన్నమ్మ తనలో తను మట్లాడుకుంటోంది. "నీకేటి అర్ధమైపోయిందే ఓ తెగ 'ఊ' కొడ్తన్నవ్?" అన్నా... "మరేటిరా ఆడించేవోడు శంకరుడు. ఆడించినా, పాడించినా పరమేసుడే కదేటి" అంది. నిజమే, ముక్క అక్షరజ్ఞానం లేకపొయినా బాగనె అర్ధం చేస్కుంది మా నాన్నమ్మ. బహుశా! హరికథలు సామాన్యులకి కూడా అర్ధం అయ్యేలా తయారు చేస్తారేమొ. మేమిద్దరం ఆ హరికథ క్యాసెట్ పూర్తైన వరకూ విని ఇక దానిగురంచి మాట్లడుకుంటూన్నాం... ఇంతలో ఒక వైష్ణవుడు (నాకు వీళ్ళనేమంటారో తెలీదు కాని, వీళ్ళు  ఒక అక్షయపాత్ర పట్టుకొని మా ఊరివైపు ఇంటింటికీ తిరుగుతుంటారు) మా గడప మీదకి వచ్చి తన అక్షయపాత్రని పక్కన పెట్టి... "ఏమ్మా! నరసమ్మా!! ముసలమ్మ, మనవడు కలిసి ఏం రాజకీయాలగురించి మట్లాడుకుంటున్నారు?" అంటూ మాకు ఎదురుగా గదప గోడ దన్నుతో కూర్చున్నాడు. కోపంగా నేను "వచ్చావా? అమ్మా వాసు వచ్చాడు, ఎమన్నా ఉంటే మనోడి సంగతి తేల్చేసి త్వరగా పంపెయ్యి... మా బుర్రలు తింటాడు" ఏమత్రం గౌరవం లేకుండా చాలా నిష్ఠురంగా అనేసా. దానికి మా నాన్నమ్మ చాలా బాధ పడి, "ఇంత సదివిస్తే ఉన్న మతి పోతందా నీకు, పెద్దోడు కదా, గౌరమించడం తెలీదా?" అని కోప్పడింది.
నేనేమో కొంచెం బాధ పడినట్టు ముఖం దించుకుకుర్చున్నా. మా నాన్నమ్మ, "మా వోడు సిన్నపిల్లాడు తెలీక ఏదో అన్నాడు, మనసులో ఏం పెట్టుకోక" అంది. దానికి అతను, "ఏం మనవడా పేద్దోడివైపొనావ? ఎంత సదువుతున్నావ్?" అని కొంచెం వ్యంగ్యం గా అన్నాడు. "ఏడొ తరగతి, విద్వాన్ లో సదువుతున్నా, హిరమండలం రోజూ ఎల్లొస్తన్నా" అని నాకు తెలిసిన విషయాలన్ని, కొంచెం తగ్గు స్వరం లో చెప్పేశా. "అబ్బో, ఏడొ తరగతే, ఏటి విద్వాన్ లొనే? సానా పెద్ద బడిలోనే సదుతున్నావ్... ఏది, నేనొక ప్రశ్న అదుగుతా సమాధానం చెప్తవా?" అని అడిగాడు. "ఊ" అన్నా.
"'అశ్యంబులు చెదిరినా అధిరోహకుని తప్పూ ఏది దీనికి అర్ధం చెప్పు" అని ఠక్కున అడిగేశాడు. నాకేమొ ఇది ఎక్కడా వినలేదు, ఏం చెప్పాలో తేలీదు... కొద్దిసేపు ఆలోచించి... "ప్రస్న లో 'అశ్యంబులూ కాదు 'అశ్వంబులూ అవునా?" తిరిగి అతన్నే అడిగా. "ఆ అవును అవును" అన్నాడు. దానికి వెంటనే "అశ్వంబులు అంటే గుర్రాలు, గుర్రాలు సరైన మార్గం లో వెళ్ళక తప్పు తోవ పడితే, అది గుర్రలను అధిరోహించిన చోదకుని తాప్పు, వాటిని సరైన మార్గం లో నదిపించాల్సిన బాధ్యత అధిరోహకుది పైనె ఉంటుంది" అన్నా. దానికి మా నాన్నమ్మ సంతోషం పట్టలేక నన్ను తెగ ముద్దులాడి, "ఏమి సామి! మా వోడు ని ఇంత సదివించినామంటే ఊరికే అనుకుంటన్నావా? మా వాడి దగ్గర నీ ప్రశ్నలు ఏం పనికిరావు" అని ఆపుకోలేని నవ్వుతొ చెప్పేసరికి, అతను ఇంక మా దగ్గర ఒక నిమిషం కూడా ఉండకుండ పరుగు తీశాడు.
........
"నాయనా! లేవరా, బస్సు కి టైం అవుతుంది, లేచి త్వరగా రెడీ అవ్వు" అమ్మ నన్ను నిద్ర లేపింది. లేచి నన్నమ్మ ఫోటో చూసి దణ్ణం పెట్టుకున్నా. ఆ కల ప్రతి రాత్రి వస్తే బగున్ను అనిపించింది. చిన్నప్పుడు మా అమ్మకన్నా నాన్నమ్మ దగ్గరే ఎక్కువ చనువుగా ఉండేవాడ్ని. పురాణ కాలక్షేపాలకు వెళ్ళినా, గుళ్ళూ, గోపురాలు తిరిగినా, యాత్రలు, జాగరణలు అని వెళ్ళినా అన్నీ నన్నమ్మతొ దగ్గరుండి తిరిగా. చిన్నతనమంతా నాన్నమ్మే నా జీవితం లో ఎక్కువ. నా చదువు, ఉద్యోగం, సంపాదన, మా ఇల్లు, మా పొలాలు అంతా ఆమె కరుణ.
చిన్నప్పుడు, మేమిద్దరం పొలానికి వెళ్ళ్తే, నేను అక్కడ ఆడుకుంటుండేవాడ్ని, ఆమె మాత్రం చీకటి పద్తున్నంతవరకు పని చేస్తు కూర్చునేది. అప్పట్లో ఏదొ పని చేస్తుంది లె అనుకునేవాడ్ని.
ఈ మధ్య ఒక రొజు మా ఫ్రెండ్స్ తొ కలిసి ఒక జీడి మామిడి తోటగుండా వెల్తే, ఆ తోట కాపరి మమ్మల్ని చూసి మేమేదొ పల్లు తుంచెయ్యటనికి వచ్చామనుకుని మా దగ్గరకి వచ్చి, మా వివరాలు అడగటం మొదలు పెట్టదు, నేను పలాన అని తెలిసి, బాబు ఈ తోట మీదే అనేసరికి అప్పుడు తెలిసొచ్చింది, చిన్నప్పుడు నేనాడుకుంటుంటే, మా నాన్నమ్మ అక్కడ ఈ మొక్కలు వేసి, వాటికి కాపల కాసి, నీరు పోసి పెంచినవే ఇప్పుడు పెద్ద తోటై, ప్రతి ఏటా చక్కని పంటనిస్తున్నాయి.
నా డిగ్రీ లో ఆమె కాలం చేసింది. మనవళ్ళు పెద్ద చదువులు చదివి ప్రయోజకులు కవాలి, కొడుకులు చక్కగా ఉద్యోగాలు చేసుకోవాలి, మా కుటుంభం బగ వ్రుధ్ధిలోకి రావాల్లని, పంటలు పందాలని, ఊళ్ళో అందరూ సంతోషం గా ఉండాలని ఎంతో తాపత్రయపడ్డ ఆమెకు మేమేమిచ్చి రుణం తీర్చుకోగలం...
ప్రపంచాన్ని నడిపించేది ఒక శక్తి ఐతే, చాలామంది ఆ శక్తి దేవుడంటారు, కాని మన ముందువాళ్ళు అని నేనంటాను. నన్ను నడిపించేది మాత్రం మా నాన్నమ్మ అంటాను.
"ఆమె దీవెనలు మా కుటుంబానికి కలకాలం ఉంటాయి"

1 కామెంట్‌:

  1. హయ్, బావ నీ బ్లాగు చదివి చాలా రోజులు అయ్యింది, నీకు గుర్తుందా, మీ ఊరికి వచ్చి కుడా ఏడాది గడిచిపొయింది. మళ్ళి రావాలి, ఏటిలొ తానాలాడి, ఊరంతా తిరాగాలి, ఏప్పుడు యెలదామెటి... ఆరోగ్యం జాగ్రత్తా.

    రిప్లయితొలగించండి