14, అక్టోబర్ 2010, గురువారం

అమ్మా... తమ్ముడు మన్ను తినేను....

నేను ఒక రోజు స్కూల్ బస్సు లో వెళ్తుండగా...

మా బస్సు డ్రైవరు భక్తి పాటలు వేశాడు... పాట మన "ఎన్.టి.ఆర్" గారి పాండురంగ మహత్యం సినిమా లోనిది... "జయ క్రిష్ణా ముకుందా మురారి... జయ గోవింద బ్రుందా విహారీ"... నేను లీనమైపోయి వింటున్నా.

ఆ పాట మధ్య లో.. "అమ్మా తమ్ముడు మన్నూ తినెను చూడమ్మా అని రామన్న తెలుపగా..." అని వచ్చింది. అంటే శ్రీక్రుష్ణుడు మన్ను తిన్నాడని, యశోదమ్మకు అన్న బలరాముడు తెలియజేస్తాడు. అది విని వెంటనే నాకో ఆలోచన వచ్చింది. ఓ ఓ ఇక్కడ మీకో విషయం చెప్పటం మరిచిపోయాను. ఎప్పుడూ లొడ లొడా వాగే నాకు, నాతో మాట్లాడటానికి మా ఇంట్లో ఎవరూ ఉండేవాళ్ళు కాదు. అంతా వాళ్ళ వాళ్ళ పనుల్లొ తీరిక లెకుండా ఉండేవాళ్ళు. నేను ఏ అల్లరి చేసినా తిరిగి నాకు బ్యాండు పడేది.

అలాంటి నాకు మా అమ్మ కనిపించేది, నన్ను భరించటానికి. ఎప్పుడూ అమ్మ చుట్టూ తిరిగేవాడ్ని. ప్రతి చిన్నదానికీ అమ్మను పిలిచేవాడ్ని. అది పనికొచ్చే విషయమైతే అమ్మ వినేది, హెల్ప్ చేసేది. పనికిరానిదైతే అమ్మ కూడా చిరాకుపడేది.

చివరికి పని ఉన్నా, లేకపోయినా, అవసరం లేకపోయినా నా నోట్లో "అమ్మ అమ్మ" అని తెగ వచ్చేసేది. మా అమ్మ నా పైన విసుక్కునేది. నాకు బాధనిపించేది కాని ఏం చెయ్యను నాకు అలవాటైపొయింది.

ఇప్పుడు ఆ బస్సులో ఆ "అమ్మా తమ్ముడు మన్నూ తినెను చూడమ్మా అని రామన్న తెలుపగా..." విని దీనిని వాడుకోవాలని ఒక ఆలోచన వచ్చింది.

అప్పట్నుంచి ఎప్పుడైనా పొరపాటున "అమ్మ" అని వస్తే, మా అమ్మ చిరాగ్గా నా వైపు చూసినప్పుడు ఆమెను శాంతపరచటానికి కొనసాగింపు అన్నట్టు ఆ మిగిలిన ముక్క "తమ్ముడు మన్ను తినెను" అని పాడేసే వాడ్ని. చిరాకు ముఖం లో కాస్త చిరునవ్వు వచ్చేసేది.

 మీకు చెప్తే నవ్వుతారేమో.. ఈ అలవాటు ఇంకా ఉంది నాకు. ఇప్పుడైతె మా అమ్మ చాలా సున్నితంగా "తమ్ముడు మన్ను తినటం ఇంకా ఆపలేదా నాయనా"... అంటుంది. ఇద్దరం తెగ నవ్వుకుంటాం, నేను చిన్నప్పుడు చేసిన అల్లరి గురించి మా అమ్మ చెప్తుంటే.

మీరు కూడా చిన్నపుడు తెగ అల్లరి చేసుంటారు. అభ్యంతరం లేకపొతే... ఈ పోస్టు కి కమెంటు లో మీకు నచ్చిన ఏదో ఒక అల్లరి పనిని వ్రాయండి.

"పాత ఙ్ఞాపకాలను నెమరు వేసుకునేది స్నేహితులతోనే గా".... మీ... జగన్

2 కామెంట్‌లు:

  1. This is my first visit to your blog. You asked your friends to share their memories. But I'm presenting mine.

    Though they named me 'madhuri', they call me 'madhu'. I have a cousin called 'madhusudan'. When I was about 7 or 8 I asked my mother if they would have named me 'madhusudan' if I were a boy. My mother laughed uncontrolably. I didn't understand why she laughed but I couldn't ask her the reason because I was shy. Now I laugh at myself at my own (unknown) question.

    రిప్లయితొలగించండి