5, అక్టోబర్ 2010, మంగళవారం

అప్పుడు నా వయసు ఎనిమిదేళ్ళు...

   కొత్తగా నేను టౌనుకు వెళ్ళా... నా మూడో తరగతి లో నన్ను మా ఊరికి ఎంతో దూరం లో ఉన్న కోటబొమ్మాళి కి తీసుకెళ్ళారు మా నాన్న గారు. ముందు చెప్పినట్టు నాకు అక్కడ అంతా కొత్తగా అనిపించింది. టౌనులో దిగగానే మా నాన్న నన్ను తిన్నగా ఒక స్కూల్ కి తీసుకెళ్ళారు. నాకు ఆ స్కూల్, అక్కడ ఆటస్థలం, డ్రిల్ల్ చెస్తూ, ఆటలాడుతూ కొంతమంది పిల్లలు కనిపించారు. వాళ్ళ యూనిఫార్మ్ బట్టలు, కాళ్ళకేసుకున్న బూట్లు చూసి తెగ సంబరపడిపొయా. అంతె, ఇక ఇంటికి వచ్చి మా అమ్మతో, తమ్ముడి తో చెప్పి గంతులేసేవాణ్ణి. మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్తానా అనిపంచేది.

   ఆ టైం వచ్చింది. మా అమ్మ నన్ను నీట్ గా తయరు చేసింది, నా కోసం కొన్న బూట్లను తొడిగింది. మా పొరుగూరి వరకూ (అప్పటికి మా ఊరికి బస్సు సదుపాయం లేదు...) తోడుగా తను, తమ్ముడు, మా నాన్నమ్మ... అంతా వచ్చారు. వెళ్ళొస్తానని మా ఊళ్ళో కనిపించిన ప్రతి ఒక్కరికీ చెప్తున్నా. అందరూ నన్ను సాగనంపారు. అమ్మ వచ్చి నా నుదిటిపైన ముద్దు పెట్టి బాగా చదువుకోమని, ఎవరితోనూ గొడవ పడొద్దని చెప్పి నన్ను బస్సు ఎక్కించింది. తమ్ముడికి టాటా చెప్పి నాన్న పక్కనే కిటికీ వైపు సీటు లొ కుర్చున్న. కాసేపు తర్వాత, కిటికీ నుంచి వచ్చే చల్ల గాలికి మా నాన్న ఒడిలోకి చేరి మెల్లగా నిద్రపొయా. లేచేసరికి మళ్ళీ అదే స్కూలు.

   తిన్నగ తీసుకెళ్ళి ఒక క్లాసు లో కూర్చొపెట్టారు. అంతా కొత్త మనుషులు. క్లాసులో కూర్చోటానికి బల్లలు, అందరి ఒళ్ళోనూ పుస్తకాలు బ్యాగులూ ఉన్నాయ్. నా ప్రక్కన కూర్చున్న అబ్బాయి చేతిలో ఇంగ్లిషు పుస్తకం. మంచి మంచి బొమ్మలుతో అందంగా ఉంది అది. మా నాన్న నన్ను అక్కడే వదిలేసి ఆ ఊళ్ళోనే ఉన్న మా బంధువుల ఇంటికి వెళ్ళారు. నేను మధ్యహ్నం కూడా అక్కడే తిని సాయంత్రం మా నాన్న వస్తే ఇంటికి బయలుదేరాలని చూస్తూ క్లాసు బయట ఒక బల్ల పైన కుర్చున్న. పిల్లలంతా కేరింతలు కొడ్తూ స్నాన్నాలు చేస్తున్నారు. ఇంతలో హెడ్మాస్టారు వచ్చి, మీ నాన్నగారు ఇక రారనీ, నన్ను ఆ స్కూలు లోనే హాస్టలు లో జాయిన్ చెసారని చెప్పారు. నేను అదేమి నమ్మకుండా, ఏదో తమాషాకి అంటున్నారనుకునీ, తిరిగి అతనితో, మా ఊరు పక్కనే అనీ, నేను మా ఊరినుంచి స్కూలు కి వెళ్ళివస్తుంటానని చెప్పా. అతను నా తెలివితేటలకి చిన్నగా నవ్వి, వివరంగా చెప్పరు.

   నిజమే, నేను మా ఊరి నుంచి దాదాపు 80 కి. మి. ల దూరం లో ఉన్నా. అప్పటివరకూ నాకు గుర్తుకు రాని తమ్ముడు, నాన్నమ్మ, మా ఇల్లు, మా ఊరు, నేను టాటా చెప్తున్నప్పుడు నా వైపు జాలి గా చూసిన మా ఊరి వాళ్ళ ముఖాలు. నన్ను బస్సు ఎక్కించి ఏడుస్తూ తిరిగి వెళ్ళిపొయిన మా అమ్మ ఒక్కసారిగా గుర్తొచ్చారు. నేను ఏడిస్తే ఆ ఏడుపు విని అయినా పరిగెత్తుకు వస్తారని గుక్కతిప్పకుండా ఏద్చను. అప్పటి వరకూ ఎంతో అందంగా కనిపించిన ఆ స్కూలు ఒక జైలు లా కనిపించింది. అక్కడ ఆడుతూ పాడుతూ కనిపించిన పిల్లలంతా నా లాగే తల్లిదండ్రులకు దూరంగా ఉన్న జైలు పక్షుల్లా కనిపించారు. ఎవర్ని చూసినా భయం.

    కాసేపటి తరువాత, నన్ను హాస్టల్ కి తీసుకువెళ్ళి పాలు, బిస్కెట్లు ఇచ్చారు. మా నాన్నగారు నాకొసం కొన్న పుస్తకాలు, బ్యాగు, బట్టలు, ఒక పెట్టె, అందులో నాకోసం 3 నెలలు వరకూ సరిపడా పేస్టులూ, సబ్బులూ అన్నీ ఉంచారు. ఎన్ని ఉన్నా ఆప్యాయంగా చుసే అమ్మ లేదు, నాతో ఆడుకొవటానికి తమ్ముడు లేడు. లాలించి కథలు చెప్పటానికి నాన్నమ్మ, తాతయ్యలు లేరు. అలా ఆ జైలు లో 3 ఏళ్ళు గడిపాను. అవును నా 3,4,5 తరగతులు అక్కడే చదివాను. ఆ తర్వాత ఎన్నో కొత్త జైళ్ళు మారాననుకోండి.


    ఇంకా మరెన్నో అనుభవాలతో మరిన్ని పుటలు రాస్తాను. మీకు నచ్చితే ఒక చిన్న కామెంటు పెట్టండేం. ఉంటాను మరి.

    మీ అందరి శ్రేయస్సూ అభిలషిస్తూ...

                                                                మీ... మిత్రుడు.

6 కామెంట్‌లు:

  1. u don't have chance to know abt WINE at that age otherwise u would have rename it as WINEmanasulu.....:-)

    రిప్లయితొలగించండి
  2. Story manchi intersting ga undhii.... next episode kosam nenu, surendra chero nalugu kallatho wait chesthu untamm...

    రిప్లయితొలగించండి
  3. స్టోరీలో ఫీల్ చాలా బాగుంది. చదువుతుంటే పాపం అనిపించింది.

    రిప్లయితొలగించండి
  4. Hats off... Prati okkaru feel ayye sanghatanalee... kani danni okachota... oka varusalo pettatam... aa sandharbam lo vunna manasika vattillu sangarshanalni cheppatam... Bavundi... Naini Subhrahmanyam Naidu ani oka writer vunnaru.... Veelaithe okasari ayana books chaduvu....

    All the best... And dont stop this habbit of writting... Very few people get this as a boon....

    రిప్లయితొలగించండి
  5. Why cant you try as director?.While i was reading story ,I felt ,it was like one director was telling the story to his producer or hero.In fact,The story is good .

    రిప్లయితొలగించండి